Friday, November 18, 2011

బాబుకు బెయిల్ దొరకదు: వైఎస్‌ఆర్ యువసేన ( Sakshi NRI News on 18-Nov-2011 ).

అమెరికా: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ ఆస్తులపై సీబీఐ విచారణను అమెరికాలోని వైఎస్‌ఆర్ యువసేన స్వాగతించింది. ఈ విచారణ నిష్పక్షపాతంగా జరిగితే బాబుకు బెయిల్ కూడా లభించదని అభిప్రాయపడింది. 30 ఏళ్ల రాజకీయ జీవన ప్రస్థానంలో బాబు సంపాదించిన ఆస్తులపై ప్రజలకు జవాబు చెప్పవలసిన బాధ్యత ఉందని పేర్కొంది. అందుకు ఈ తొమ్మిది ప్రశ్నలను బాబుకు ఎన్నారై యువసేన సంధించింది.


1) రెండు ఎకరాల అసామి 30 ఏళ్లలో వేలాది కోట్లు ఏలా సంపాదించారు?
2) స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో లోకేష్ విద్యాభ్యాసం కోసం డోనేషన్ కింద ఫీజు ఏలా చెల్లించారు?
3) ఏటువంటి ఆదాయం లేని బాబు తల్లి అమ్మణమ్మ లోకేష్‌తో పాటు ఇతర మనుమలు మనమరాళ్లుకు రూ.75 లక్షలు బహుమతిగా ఏలా ఇవ్వగలిగారు?
4) సినీ నటుడు మురళీమోహన్ వందలాది ఎకరాల కోనుగోలు చేసిన తర్వాతే హైటెక్ సిటీ అక్కడ ఏర్పాటు చేశారు ఇది నిజం కాదా?
5) మీ ఇంటిలో మూడు గదులు మాత్రమే ఉన్నాయని చెప్పిన మాటలకు కట్టుబడి ఉంటారా?
6) హెరిటేజ్ సంస్థ కోసం ఎనభై కోట్లు విలువ చేసే భూములను కేవలం రెండు కోట్లకే కోనుగోలు చేశారు ఇదేలా సాధ్యం? దీని వేనక ఉన్న మతలబు ఏమిటి?
7) 1984 లో 40 లక్షల లోన్ తీసుకుని 14 ఏళ్ల తర్వాత కేవలం 11 లక్షలు చెల్లించారు. ప్రజల సోమ్మును ఇలా కైంకర్యం చేయడం సమంజసమా? ఇది ప్రజలను మోసం చేయటం కాదా? ఇది అధికార దుర్వినియోగం కాదా?
8) ఇతర రాజకీయ నాయకులపై విచారణ అనగానే స్వాగతించే మీరు మీ పై విచారణ అనగానే ఎందుకు స్వాగతించలేక పోతున్నారు?

9)అన్నా హజారే తమ్ముడని చెప్పుకునే మీరు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మీపై సీబీఐ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో విచారణను ఎందుకు స్వాగతించడంలేదు?
పై ప్రశ్నలకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వెంటనే జవాబు చెప్పాలని వైఎస్‌ఆర్ యువసేన డిమాండ్ చేసింది.